మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి

25 రోజుల్లో రూ. 7 లక్షల ఎల్ ఓ సి మంజూరు

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి,సెప్టెంబర్25తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గత నెల రోజుల క్రితం వనపర్తి పట్టణం రాయిగడ్డలోని నందమోని బాలరాజు కుమార్తె రేవతి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే, పెళ్లికూతురి పుట్టుక నుంచి డెఫ్ అండ్ డెం (వినికీ, మానవ శ్రవణ సమస్య) బాధితురాలిగా ఉన్నట్లు తెలుసుకున్నారు.

పెళ్లికూతురికి మాట్లాడే అవకాశం లేనందున తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గమనించిన ఎమ్మెల్యే, తన వంతు సహాయంతో ఆమెకు అవసరమైన మిషన్ అందిస్తానని చేశారు. అంతకుముందు, కేవలం నెల రోజులలోనే అత్యాధునిక “కాక్లేర్ ఇంప్లాంట్” కోసం రూ. 7 లక్షల విలువైన ఎల్ ఓ సి మంజూరు చేశారు.

కొత్తగా పెళ్లి చేసుకున్న తన కుమార్తె మౌనంగా ఉన్న కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను కుటుంబ సభ్యులు ప్రతిక్షణం అనుభవిస్తున్న సమయంలో, ఎమ్మెల్యే మేఘా రెడ్డి భగవంతుడిలా మారి ఈ మద్దతు అందించడం వల్ల కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రులు దామోదర రాజనర్సింహ మరియు ఎమ్మెల్యే మేఘారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .