వినాయక మండపాలకు పూజా సామాగ్రి పంపిణీ చేసిన నేను సైతం
భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి
--- నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దిండి ప్రవీణ్ కుమార్
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ మండల కేంద్రంలోని బలీదుపల్లి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక స్వామికి పూజా సామాగ్రిని దేవాలయంలో నేను సైతం స్వచ్చంధ సంస్థ అధ్యక్షులు దీడ్డి ప్రవీణ్ కుమార్ బలీదుపల్లి దేవాలయానికి పంపించడం జరిగింది.
వినాయక చవితి సందర్భంగా మండపాలకు 33 రకాల పూజా సామాగ్రిని పంపిణీ చేస్తున్నామని నేను సైతం ఆధ్వర్యంలో వినాయక మండపాలకు తన సొంత డబ్బులతో ప్రతి యేటా పూజ సామాగ్రిని పంపిణీ చేస్తున్నానని తెలియజేశారు.. వినాయకుని ప్రతిష్టించిన రోజు నుండి నిమజ్జనం చేసే వరకు ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో పాల్గొనాలని తెలిపారు,
ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ దయాకర్, కోట్ల ప్రతాప్ రెడ్డి, మంగరాయి వెంకటేష్,శ్రీధర్,దేవరాజు,యాదయ్య సాగర్,మాజీ ఎంపీటీసీ గణేష్,ప్రవీణ్,మహేష్ సాగర్,నాగరాజు,అంజి గ్రామ యువకులు పాల్గొన్నారు,


Comments