మల్లికుదుర్ల గ్రామంలో ఆగని చోరీలు
Views: 33
On
వేలేరు,అక్టోబర్5(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గ్రామానికి చెందిన బొజ్జ రాజు (48) ఆదివారం ఉదయం తన గేదెల కొట్టం వద్దకు వెళ్లగా, గేటు వద్ద టైర్ల అచ్చులు కనిపించడంతో అనుమానం వచ్చింది. లోపలికి వెళ్లి చూసేసరికి నాలుగు పొట్టేళ్లు, నాలుగు మేకలు, నాలుగు గొర్రెలు దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దొంగతనానికి గురైన వాటి మొత్తం విలువ సుమారు 80 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు.ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఇటీవలి కాలంలో ఇలాంటి చోరీలు పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments