నల్లబెల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభం

నల్లబెల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభం

నల్లబెల్లి,తెలంగాణ ముచ్చట్లు:
వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌ను ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఆదేశాల మేరకు నిర్వహించబడింది.

ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, ఎమ్మెల్యే నాగరాజు చొరవతో జిల్లా కలెక్టర్ నుండి అనుమతి తీసుకుని ఐకేపీ సెంటర్ ప్రారంభం సాధ్యమైందని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ సౌకర్యం కొంచెం ఆలస్యమైందని, కానీ గ్రామస్థులు మరియు మహిళా సంఘాలు సెంటర్ ప్రారంభం పట్ల సంతోషం వ్యక్తం చేశారన్నారు.

వెంకటయ్య మాట్లాడుతూ, సన్నరకం వరికి రూ.500 బోనస్ అందించడం, రెండు లక్షల రుణమాఫీ వంటి చర్యలతో రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు మాలతి రెడ్డి, మల్యాల దేవేందర్, గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .