మోజర్ల ఉద్యానవన కళాశాలలో నూతన గ్రంథాలయ భవనం ప్రారంభం
బాలికల వసతి గృహానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి
పెద్దమందడి,నవంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మోజర్ల కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన కళాశాలలో నూతనంగా నిర్మించిన ఆధునిక గ్రంథాలయ భవనాన్ని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి మంగళవారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం అదే ప్రాంగణంలో బాలికల వసతి గృహ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి పునాదిరాళ్లు వేశారు.కళాశాల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థులు, అధ్యాపకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. కళాశాలలో విద్యార్థుల కోసం మెరుగైన వసతులు, పరిశోధన అవకాశాలు, సాంకేతిక వనరుల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ..గ్రంథాలయం విద్యా సంస్థ హృదయం. విద్యార్థులు చదువులో ముందుకు సాగేందుకు, పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే బాలికల వసతి గృహం ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు సురక్షిత వాతావరణం కలుగుతుంది.వీటితో పాటు, విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి మరిన్ని పధకాలను ప్రభుత్వం తీసుకురాబోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు


Comments