తారకరామారావు విగ్రహ ఆవిష్కరణ.
Views: 16
On
సత్తుపల్లి, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
కల్లూరు మండల పరిధిలోని దారుక బంజర్ వద్ద నిర్వహించిన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణలో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా సహకార బ్యాంకు నిర్వాహకుడు తుళ్లూరి బ్రహ్మయ్యతో కలిసి టిజిఐడిసి చైర్మన్ మువ్వా విజయబాబు స్వామి పాల్గొన్నారు.
విజయబాబు స్వామి ఈ సందర్భంగా తారక రామారావు చేసిన సేవలు, ఆయన గొప్పతనం, కీర్తి, ప్రతిష్ఠలను స్మరించుకున్నారు.
కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వేదిక వద్ద నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments