విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రం ప్రారంభం

విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రం ప్రారంభం

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటకులకు మరింత చేరువగా సేవలందించేందుకు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక పర్యాటక సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది.

ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పర్యాటక రంగంలో కొనసాగుతున్న సంస్కరణల భాగంగా పర్యాటకులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ సమాచార కేంద్రం ద్వారా రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు, టూర్ ప్యాకేజీలు, రిజర్వేషన్లు, రూట్ మ్యాప్ వంటి వివరాలను పర్యాటకులకు అందిస్తారు.WhatsApp Image 2024-12-19 at 7.46.05 PM (1)

ఈ కేంద్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సేవలందించనుంది. ఇప్పటికే బషీర్‌బాగ్, బేగంపేట, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, శిల్పారామం వంటి ప్రాంతాల్లో పర్యాటక సమాచార కేంద్రాలు విజయవంతంగా సేవలందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, సంచాలకులు జెండగే హనుమంతు కొండిబా, జీఎంఆర్ సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .