ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి

 హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ వాటి పురోగతి గురించి, పనులు పూర్తి చేయడంపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.WhatsApp Image 2025-07-30 at 9.08.27 PM (1) వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం పరకాల పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ సుష్మ, వార్డు అధికారులతో సమావేశం నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగే విధంగా, బిల్లుల చెల్లింపు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా నడికూడ తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ సందర్శించి భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .