ప్రజా పోరాటాలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,
వనపర్తి,సెప్టెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమకారిణి, తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె వీరత్వాన్ని ఆయన స్మరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనపర్తి పట్టణంలోని బస్టాండ్ వద్ద గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు అర్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని పిలిపించుకునే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ప్రథమురాలు అని అన్నారు. ప్రజా పోరాటాలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిజె. శ్రీనివాస్, లక్కాకుల సతీష్, మాజీ కౌన్సిలర్లు వెంకటేష్, చీర్ల సత్యం, బ్రహ్మంచారి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కృష్ణ, శ్రీహరి రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments