సృజనాత్మకతను ప్రతిబింబించిన స్మార్ట్ కిడ్జ్ ఇన్స్పైర్-2025

సృజనాత్మకతను ప్రతిబింబించిన స్మార్ట్ కిడ్జ్ ఇన్స్పైర్-2025

---అబ్బురపరిచిన బాల సైంటిస్టుల సైన్స్ నమూనాలు. 

-ఇన్స్పైర్ -2025 ను ప్రారంభించిన 
యువనేత తుమ్మల యుగంధర్ 

---భవిష్యత్తులో సైంటిస్టులుగా మారి సమాజానికి సేవలు అందించాలి... తుమ్మల యుగంధర్. 

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 20(తెలంగాణ ముచ్చట్లు)IMG-20251220-WA0071

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన సైన్స్ ఇన్స్పైర్ సృజనాత్మకతను ప్రతిబింబించాయి. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ ఇన్స్పైర్లో ఎగ్జిబిట్స్ అబ్బురపరిచాయి. అణువు నుంచి అంతరిక్షం దాకా బాల సైంటిస్టుల సైన్స్ నమూనాలు వారిలో దాగివున్న సృజనకు దర్పణం పట్టాయి. విజ్ఞాన శాస్త్రంలోని భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, ఆరోగ్యం, రవాణా మార్గాలు, అంతరిక్షం, సూర్య కుటుంబం,ప్రజల జీవన విధానం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సోలార్ ఎనర్జీ, గ్లోబల్ వార్మింగ్, నదులు, అడవుల ప్రస్థానం తదితర విభాగాలలో 200 కి పైగా సైన్స్ నమునాలను విద్యార్థులు ప్రదర్శించారు. తాము ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్ వివరాలను విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా వివరించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఇన్స్పైర్లో హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఎగ్జిబిట్ ను చింతనిప్పు అభయ్ కృష్ణ, కార్బన్ ప్యూరిఫికేషన్ ఎగ్జిబిట్ ను ఎం కార్తికేయ, రైన్ డిటెక్టర్ ను జి ఆద్య, వేస్ట్ మేనేజ్మెంట్ ఎగ్జిబిట్ ను పి పవిత్ర, థర్మల్ పవర్ స్టేషన్ ఎగ్జిబిట్ ను పి ప్రణీత శ్రీ, సాటిలైట్ కమ్యూనికేషన్ ఎగ్జిబిట్ ను హెచ్ .యశస్విని విశేషంగా ఆకట్టుకున్నాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎగ్జిబిట్ ను టీ మనీష్, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ ఎగ్జిబిట్ ను బీ.రుత్విక్, హైడ్రోపోనిక్స్ ఎగ్జిబిట్ ను కే క్రాంతి సుదీక్ష, స్మార్ట్ అగ్రికల్చర్ ఎగ్జిబిట్ ను బి పునర్వి, గ్లోబల్ వార్మింగ్ ఎగ్జిబిట్ ను బి విశ్వకార్తిక్, వాటర్ కన్జర్వేషన్ ఎగ్జిబిట్ ను ఆర్ మోక్షిత్ కృష్ణ, గ్రీన్ ఎనర్జీ ప్యూషన్ టి. అభిరామ్ రెడ్డి, సోలార్ సిస్టం ఎగ్జిబిట్ ను ఎం దియ, డ్రిప్ ఇరిగేషన్ ఎగ్జిబిట్ ను వీ నిహిత కుమార్, ఆర్గాన్ సిస్టం ఎగ్జిబిట్ ను బి యక్షిత్, ఎస్.కె జునైడ్, నాచురల్ క్లమిటీస్ ఎగ్జిబిట్ ను ఎన్ జస్విన్ ప్రసాద్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ డి వేదాంశ, సోలార్ పవర్ ఇరిగేషన్ ఎగ్జిబిట్ ను  కె సత్య వర్ధన్, ట్రాన్స్పోర్టేషన్ ఎగ్జిబిట్ ను డీకే . మూబిన్ అలీ, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ ఎగ్జిబిట్ ను శ్రీకృతి , హేమాన్ష్, ఫుడ్ ఫ్రమ్ ఫామ్ టు టేబుల్ ఎగ్జిబిట్ ను వై ఆద్య, ఖమ్మం సిటీ ఎగ్జిబిట్ ను బి. నిహాల్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఎగ్జిబిట్ ను కె దక్షిణ్య, జాహ్నవి, ఎర్త్కెవక్ అలారం ఎగ్జిబిటును ఎస్ శన్విక, పవర్ ప్లాంట్ ఎగ్జిబిట్ ను అనుషు మేఘన, అర్జున్ దేవ్, స్మార్ట్ సిటీ ఎగ్జిబిట్ ను ఎం. ప్రణవ్ తదితర ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. తొలుత స్మార్ట్ కిడ్జ్ ఇన్స్పైర్ ను యువ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల యుగేందర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదిగి సమాజానికి సేవలు అందించాలని కోరారు. స్మార్ట్ కిడ్జ్ పాఠశాల లో అంత పెద్ద ఎత్తున సైన్స్ ఎగ్జిబిషన్లో చిన్నారులు పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దడం స్ఫూర్తిని ఇస్తుందని  తెలిపారు. స్మార్ట్ కిడ్జ్ కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో గత 13 సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులతో సైన్స్ ఇన్స్పైర్ ను నిర్వహిస్తున్నామని విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి అంకితభావంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మోతారపు శ్రావణి సుధాకర్, పైడిపల్లి సత్యనారాయణ,  పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ ఇన్స్పైర్ ను విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తిలకించి చిన్నారులకు అభినందనలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .