సమాచార హక్కు పోరాట యోధుడు గగన్ కుమార్‌కు స్ఫూర్తి గ్రూప్ సత్కారం
ఏ ఎస్ రావు నగర్, నవంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11:30 గంటలకు కమలానగర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ఆధారంగా పోరాటం చేస్తున్న గగన్ కుమార్ కు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ప్రజాతంత్ర ఉద్యమ నాయకుడు కోమటి రవి ,గగన్ కుమార్‌కు సమాచార హక్కు చట్టంపై రాసిన ఉత్తమ పుస్తకాన్ని బహుకరించగా, సీనియర్ నాయకుడు జంపాల శ్రీమన్నారాయణ చేనేత వస్త్రాలతో ఆత్మీయంగా అభినందించారు.ఈ సందర్భంగా మాట్లాడిన కోమటి రవి మాట్లాడుతూ — “సమాచార హక్కు చట్టం సామాన్యుల చేతుల్లోని బ్రహ్మాస్త్రం వంటిది. ఇది యూపీఏ ప్రభుత్వం కాలంలో లెఫ్ట్ ఎంపీల మద్దతుతో రూపొందిన చట్టం. ఆ కాలంలో ప్రజలకు మేలు చేసే అనేక చట్టాలు తెచ్చారు. కానీ నేటి పాలకులు వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలపై మొక్కపోని దీక్షతో పోరాడుతున్న గగన్ కుమార్‌ను అభినందించాలి” అన్నారు.శ్రీమన్నారాయణ, రుక్కయ్య, కృష్ణమాచార్యులు, శారద తదితరులు కూడా ప్రసంగించారు.గగన్ కుమార్ మాట్లాడుతూ “స్ఫూర్తి గ్రూప్ అందించిన ప్రోత్సాహం నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. నన్ను అభినందించడం నాపై మరింత బాధ్యతను పెంచింది. భవిష్యత్తులో కూడా అదే ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తాను” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం. శ్రీనివాసరావు, ఎం. భాస్కర్ రావు, బాలు, శివన్నారాయణ, రుక్కయ్య, కృష్ణమాచార్యులు, శారద, శ్రీమన్నారాయణ, కోమటి రవి తదితరులు పాల్గొన్నారు.


Comments