చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండించిన స్ఫూర్తి గ్రూప్
సనాతన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఏ ఎస్ రావు నగర్, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
పూలే అంబేద్కర్ స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఈసీఐఎల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.పూలే అంబేద్కర్ స్ఫూర్తి గ్రూప్ నాయకుడు పి. మల్లేశ్ మాట్లాడుతూ, “దేశంలో మతోన్మాద శక్తులు పెట్రేగిపోతున్నాయి. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ పై సనాతన మతోన్మాది దాడి చేయడం భారత రాజ్యాంగంపై దాడి చేసినట్లే. కులవివక్ష దేశంలో మరింత గా బలపడుతున్నది. దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలిచిన గవాయ్‌పై అమానుష దాడిని తీవ్రంగా ఖండించాలి” అన్నారు.ఇక నాయకుడు కే. మల్లేశం మాట్లాడుతూ, “మతోన్మాద శక్తులు నేడు రాజ్యమేలుతున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయిస్తూ భారత రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతోంది. చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడి ఆ కుట్రలో భాగమే. అటువంటి మతోన్మాదిని సమర్థించే వారూ ఉన్నారు. ఈ దుర్మార్గత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రజాతంత్ర వాదులు పెద్ద ఎత్తున పోరాటం చేయాలి” అని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో శివన్నారాయణ, ఉదయ భాస్కర్, వెంకటేశ్వరరావు, నగేష్, గోవింద్, కోమటి రవి, బిక్షపతి, అబ్దుల్ రహీం, గగన్ కుమార్, గుమ్మడి హరిప్రసాద్, గొడుగు యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యకర్తలు “చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండించాలి”, “సనాతన ఉన్మాదిని శిక్షించాలి”, “భారత రాజ్యాంగం రక్షించాలి”, “మతోన్మాదం నశించాలి” అంటూ నినాదాలు చేశారు.కార్యక్రమానికి ముందుగా జ్ఞానమాల టీం ఆధ్వర్యంలో, పి. మల్లేశం నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎం. భాస్కర్ రావు, యాకూబ్, యాదగిరి, రహీం, గగన్ కుమార్, నగేష్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments