ఘనంగా ఐఎన్టియూసీ వైస్‌ప్రెసిడెంట్ రజాక్ జన్మదిన వేడుకలు.!

ఘనంగా ఐఎన్టియూసీ వైస్‌ప్రెసిడెంట్ రజాక్ జన్మదిన వేడుకలు.!

సత్తుపల్లి, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణ సింగరేణి ప్రాంతంలో ఐఎన్టియూసీ వైస్‌ప్రెసిడెంట్ మహమ్మద్ రజాక్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. జేవీఆర్‌ ఓసీ, కిష్టారం ఓసీ, జేవీఆర్‌ సిహెచ్‌పి ప్రాంతాల్లో ఫిట్ కార్యదర్శులు రామారావు, బాలాజీ, నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సాధారణ ఉద్యోగిగా సింగరేణిలో చేరిన రజాక్ క్రమంగా ఎదిగి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారని ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐఎన్టియూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ ప్రసాద్‌ సహకారంతో కార్మిక సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఏ ఇబ్బంది వచ్చినా రజాక్ ముందుండి పరిష్కరించే నాయకుడని తెలిపారు.

సత్తుపల్లి సింగరేణి ఉద్యోగుల క్వార్టర్స్ కమ్యూనిటీ హాల్‌, ఇండోర్ స్టేడియం, పోచమ్మతల్లి దేవాలయం వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో రజాక్ కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. తన కుటుంబ సభ్యులు స్థాపించిన మహమ్మద్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, సామాగ్రి అందజేయడం వంటి సామాజిక సేవలు చేస్తున్నారు. ఆ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుతో సత్కరించిందని వక్తలు తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాల్లో రజాక్ ప్రజాసేవ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నామని పాల్గొన్న నాయకులు ఆకాంక్షించారు.WhatsApp Image 2025-09-23 at 7.38.13 PM

కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు నాగప్రకాశ్‌, సీతారామరాజు, అసిస్టెంట్ ఫిట్‌ సెక్రటరీలు కోటి, సురేష్‌, నాయకులు పొట్టి కిరణ్‌, రామచందర్‌, మురళి, ఆవునూరి రాజేశ్వరరావు, డి.శ్రీనివాస్‌, ఎం.రాజశేఖర్‌, కోటేశ్వర్‌, నజీర్‌, అన్వర్‌, అజ్మత్‌, శ్రీనాథ్‌, అరుణ్‌, డేగలరాజు, ధనాలరాము, నరేష్‌, బావు రమేష్‌, అశోక్‌, డి.రమేష్‌, బాజీ, సాహెబ్ కరీముల్లా, రావుల చంద్రశేఖర్‌, శెట్టిపల్లి నవీన్‌, దొడ్డపల్లి రమేష్‌, ఈర్ల నగేష్‌, బండి రామకృష్ణ‌, మురళి, రెడ్డి, బషీర్‌, చారి, మోహన్లాల్ కోరి, అజయ్‌, సందీప్‌, గుండె రమేష్‌, లక్ష్మణరావు, సుభాని తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .