26న సిపిఐ భారీ ప్రదర్శనను జయప్రదం చేయండి. 

ప్రజా సమస్యలపై దశల వారి ఆందోళన. 

26న సిపిఐ భారీ ప్రదర్శనను జయప్రదం చేయండి. 

-సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి..

 ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

డిసెంబర్ 26న సిపిఐ శత జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలో జరిగే భారీ ప్రదర్శనను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్మల జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చింతకాని  సిపిఐ మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 100వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఖమ్మంలో భారీ ప్రదర్శన రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాత్, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు పార్టీ శత వసంతాల సందర్భంగా అన్ని గ్రామాల్లో పతాకావిష్కరణ చేస్తామన్నారు. పార్టీ శతవసంతాల సందర్భంగా పార్టీ గత చరిత్రను పార్టీ సాధించిన పోరాట విజయాలను నేటి తరాలకు తెలియజేయాలన్నారు ఈ నెల 30న శతజయంతి రాష్ట్రస్థాయి ప్రారంభ సభ నల్గొండ లో ఉంటుందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని బిజెపి మతం పేరుతో ఉన్మాదం సృష్టిస్తుందన్నారు. సిపిఐ మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల హామీలను విస్మరిస్తుందని  ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకముందే హామీలు అమలు చేయాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వం పై దశల వారి పోరాటానికి పార్టీ సిద్ధమవుతుందన్నారు. చింతకాని మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు 26న ఖమ్మం లో జరిగే భారీ ప్రదర్శనలో  500 మందికి తగ్గకుండా తరలిరావాలన్నారు. సమావేశానికి ముందు ఇటీవల మరణించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఫోటు ప్రసాద్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేష్ మృతికి సంతాపం తెలియజేశారు ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కొండపర్తి గోవిందరావు వేపూరి రవీంద్రబాబు పార్టీ మండల కార్యదర్శి పావులూరి మల్లికార్జున్, జిల్లా సమితి సభ్యులు కూచిపూడి రవి మార్గం శ్రీను పగిడిపల్లి ఏసు నాయకులు తాళ్లూరు యాదగిరి బాలాజీ రావు , పది మల వెంకట నరసయ్య, వేముల జానకిరామయ్య గోగుల ఆది, పెరిక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .