జీసస్ క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ వారి గ్రాండ్ సెమీ క్రిస్మస్ పండుగ
పాస్టర్ బి.ఆదాం (అప్పారావు)
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:
శనివారం రాత్రి జీసస్ క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ వారి సెమీ క్రిస్మస్ పండుగ పాస్టర్ బి.ఆదాం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో ఘనంగా జరిగింది. క్రిస్మస్ పండుగ వస్తున్న తరుణంలో ఆయా ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లో ప్రపంచంలో సెమి క్రిస్మస్ లు ఏర్పాటుచేసి ప్రజలకు సువార్త అందించడం అనేది బైబిల్ వాక్యానుసారం. ఈ సందర్భంలో సదాశివపురం గ్రామమంతా క్రిస్మస్ పండుగ వాతావరణం కనిపించింది. దాదాపుగా 200 మంది భక్తులు యొక్క సెమీ క్రిస్మస్ పండుగలు పాల్గొన్నారు. ఈ సెమీ క్రిస్మస్ లో దూర ప్రాంతం నుండి వచ్చిన దైవ సేవకులు జె.ఇశ్రాయేలు దేవుని వాక్యాన్ని అందించి ప్రజల హృదయాల్లో ఏసుక్రీస్తుని నింపారు. ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఏమి చేశాడు పాపులను రక్షించడానికి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనీ మంచి వర్తమానాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో క్రైస్తవ భక్తులు, పాస్టర్ బి.ఆదం సంఘ సభ్యులు పాల్గొన్నారు.


Comments