ఇన్ఫోసిస్‌లో సాయిస్ఫూర్తి విద్యార్థినీలకు ఉద్యోగాలు

ఇన్ఫోసిస్‌లో సాయిస్ఫూర్తి విద్యార్థినీలకు ఉద్యోగాలు

సత్తుపల్లి, నవంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం, బి గంగారం సాయిస్ఫూర్తి స్వయంప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీలు మరోసారి ప్రతిభ చాటారు. దేశప్రఖ్యాత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ నిర్వహించిన జాతీయస్థాయి నియామక కార్యక్రమంలో సాఫ్ట్‌వేర్ సిస్టం ఇంజనీర్ (ట్రైనీ) ఉద్యోగాలకు కళాశాల విద్యార్థినీలు నలుగురు ఎంపికయ్యారు.

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సియస్ఈ) విభాగం నుంచి ఇద్దరు, కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (సి యస్ యం) విభాగం నుంచి ఇద్దరు విద్యార్థినీలు సిస్టం ఇంజనీర్ (ట్రైనీ) ఉద్యోగాలు సాధించారు. ఈ విషయం వెల్లడిస్తూ కళాశాల ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ డి.ఎన్.వి. కృష్ణారెడ్డి తెలిపారు.

ఇన్ఫోసిస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు జాతీయస్థాయిలో నిర్వహించిన రాతపరీక్ష, టెక్నికల్ రౌండ్, హెచ్.ఆర్. రౌండ్ మరియు మౌఖిక ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులైన విద్యార్థినీలు తుది ఎంపిక పొందినట్లు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు కళాశాల నుంచి 52 మంది విద్యార్థులు హాజరయ్యారు.

కళాశాల సెక్రటరియేట్ & కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు, ఈ జాతీయస్థాయి ఇంటర్వ్యూలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో దాదాపు 562 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఉద్యోగాలు పొందిన వారు మన సాయిస్ఫూర్తి కళాశాల విద్యార్థినీలే కావడం గర్వకారణం అని అన్నారు.

విద్యార్థినీల విద్యా నైపుణ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వినూత్న విషయాలపై ఉన్న అవగాహన ఆధారంగా ఇన్ఫోసిస్ సంస్థ వారు వీరిని సిస్టం ట్రైనీ ఇంజినీర్లుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. చివరి సంవత్సరం పూర్తయిన వెంటనే వీరు బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాలలో విధులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. వార్షిక వేతనం రూ.3.6 లక్షలు ఇవ్వబడనుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విత వర్చువల్ ద్వారా విద్యార్థినీలను అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషరత్నకుమారి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అనేక ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. విద్యార్థులకు ప్రాజెక్టులు, ఇంటర్నల్‌షిప్‌లు, ఇండస్ట్రియల్ టూర్లు అందిస్తున్నాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మరియు సియస్ఈ విభాగాధిపతి డాక్టర్ షేక్ యాకూబ్, ఏఐ & ఎంఎల్, ఏఐ & డీఎస్ విభాగాధిపతి డాక్టర్ తోటకూరి వీరన్న, ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ డి.ఎన్.వి. కృష్ణారెడ్డి, అన్ని ఇంజనీరింగ్ బ్రాంచీల విభాగాధిపతులు పాల్గొన్నారు.

డిపార్ట్‌మెంట్ ప్లేస్‌మెంట్ ఇన్‌చార్జీలు, కళాశాల ఫ్యాకల్టీ సభ్యులు ఉద్యోగ అర్హత సాధించిన విద్యార్థినీలకు అభినందనలు తెలిపారు.IMG-20251112-WA0079

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .