జర్నలిస్టులు తమ బాధ్యతను మరువద్దు

నాటి మహనీయుల త్యాగ ఫలితమే నేడు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జర్నలిస్టులు తమ బాధ్యతను మరువద్దు

-- ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

-- టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి


 ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

సమాజం పట్ల జర్నలిస్టులు తమ బాధ్యతను మరువద్దని, దేశ స్వాతంత్ర్యం కోసం నాడు మహనీయుల పోరాటం, ప్రాణ త్యాగాల ఫలితమే నేడు స్వేచ్ఛగా, ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి లు అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జర్నలిస్టులు ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జై జవాన్, జై కిసాన్, 'బోలో స్వాతంత్ర్య భారత్ కి జే' నినాదాలతో జర్నలిస్టులు 'జన గణ మన' గీతం ఆలపించి స్వాతంత్రం కోసం పోరాడి అమరులైన మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి, యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నెబోయిన సాంబశివరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, WhatsApp Image 2025-08-15 at 9.02.31 PMగడ్డికొప్పుల ప్రశాంత్ రెడ్డి, టిఎస్ చక్రవర్తి, మందుల ఉపేందర్, దుంపల భాస్కర్, ఆడెపు ఉపేందర్, కలువకొలను హరీష్ రాజు, మీడియా ఇంచార్జి పేరబోయిన తిరుపతిరావు లు మాట్లాడుతూ.. జర్నలిస్టుల ప్రధానమైన ఇండ్ల స్థలాల సమస్యతో పాటు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఐకమత్యం, పటిష్టమైన ప్రణాళికతో పోరాడి సాధించుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, కోశాధికారి బిక్కి గోపి, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, నాయకులు సరస్వతీభట్ల సీతారామయ్య, కాపాటి నరేందర్, కొనుగంటి గోవింద్, మందా మోహన్, వల్లూరి సంతోష్ కుమార్, పొన్నెబోయిన పానకాలరావు, నారని సాయికుమార్, తళారి సాయికార్తిక్, దూసరి కళ్యాణ్, దండాల ప్రభాకర్ రెడ్డి, నల్లమోతు శ్రీనివాస్, పులి శ్రీనివాసరావు, ధర్మసోత్ రామకృష్ణ, కూరపాటి నరేష్, ఇస్సంపల్లి వెంకటేశ్వర్లు, పెంటి వెంకటేశ్వర్లు, వల్లోజు రమేష్ కుమార్, శీలం వెంకటేశ్వరరెడ్డి, బొల్లెపోగు అప్పారావు, రేపాక యాదగిరి, అమరబోయిన ఉపేందర్, గుర్రం మనోజ్, ఎబి న్యూస్ శ్రీను, జెట్టి రోజా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .