జర్నలిస్టులు నూతన వరవడిని కొనసాగించాలి
టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
కేక్ కట్ చేసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
కొత్త సంవత్సరంలో జర్నలిస్టులు నూతన వరవడిని కొనసాగించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి అన్నారు. నూతన సంవత్సరం -2025 ను పురస్కరించుకొని ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు కేక్ కట్ చేసి జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టియుడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి పాల్గొని మాట్లాడారు. జర్నలిజంలో నూతన వరవడిని సృష్టిస్తూ ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో జర్నలిస్టులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వాయిస్ ఆఫ్ వర్డ్స్ స్టాఫ్ రిపోర్టర్ అర్వపల్లి నగేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా సహాయ కార్యదర్శి షేక్ జానీపాషా, శ్రీధర్ శర్మ, నగర అధ్యక్షులు యలమందల జగదీష్, ప్రెస్ క్లబ్ సెక్రెటరీ కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరావు, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డి, వంగూరి ఈశ్వరి, అంతోటి శ్రీనివాస్, షేక్ మదర్ సాహెబ్, మెట్రో శీలం వెంకటేశ్వరరెడ్డి, పొన్నెబోయిన పానకాలరావు, వుళ్లోజి రమేష్, పులి శ్రీను, గోవింద్, ఆశయం రోసిరెడ్డి, ఇస్సంపల్లి వెంకటేశ్వర్లు, మందుల వెంకటేశ్వర్లు, ఉపేందర్, సికే న్యూస్ ఉపేందర్, యాదగిరి, పి వెంకటేశ్వర్లు, స్టార్ శ్రీను, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


Comments