వెల్టూర్ చెరువుకు నిధులు మంజూరు పై హర్షం 

వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి (బంగ్లా బాబు) 

వెల్టూర్ చెరువుకు నిధులు మంజూరు పై హర్షం 

వనపర్తి , తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ గోపాల సముద్రం చెరువు పునరుద్ధరణ పనులకు జీవో ఆర్టి నెంబర్ ప్రకారం ప్రభుత్వం 66 లక్షల 50 వేలు నిధులను మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వం వెల్టూరు చెరువుకు నిధులు మంజూరు చేయడం పట్ల వెల్టూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి (బంగ్లా బాబు) గురువారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువుల పటిష్టత కోసం, రైతుల శ్రేయస్సు కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు కృషిచేసిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డిని, సీఎం రేవంత్ రెడ్డిని జగదీశ్వర్ రెడ్డిని గ్రామ రైతుల తరఫున, ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .