గోపాల్ పేట మండల ఎస్సీ ఫెడరేషన్ కన్వీనర్ గా కాటిక కురుమన్న ఎన్నిక
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
ఎస్సీ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బహుజన రమేష్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో మండల ఎస్సీ ఫెడరేషన్ కన్వీనర్ లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో... గోపాల్ పేట మండల ఎస్సీ ఫెడరేషన్ కన్వీనర్ గా కాటిక కురుమన్న ను నియమిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బహుజన రమేష్ మరియు శ్రీరంగాపూర్ మండలం కన్వీనర్ జె .పర్వతాలు కలిసి నియమిస్తూ మరియు కొత్తగా నియమించిన కాటుక కురుమన్నను శాలువాతో సన్మానించడం జరిగింది. ఎస్సీ ఫెడరేషన్ ఒక ప్రజా సంఘం అంబేద్కరిజం మరియు కాన్సిరాం యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా కన్వీనర్ బహుజన రమేష్ తెలిపారు. ఈ ఫెడరేషన్ లో అన్ని మతాలను మరియు అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వారి యొక్క సమస్యల పైన ఎస్సి ఫెడరేషన్ ముందుకు తీసుకుపోతుందని శ్రీరంగాపూర్ మండల కన్వీనర్ జె.పర్వతాలు తెలిపారు.వనపర్తి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో త్వరలోనే పూర్తి స్థాయిలో మండల కన్వీనర్ లను నియమించడానికి ముమ్మరంగా ముందుకు సాగుతున్నామని జిల్లా కన్వీనర్ బహుజన రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎస్సీ ఫెడరేషన్ కన్వీనర్ బహుజన రమేష్, శ్రీరంగాపూర్ మండల ఎస్సీ ఫెడరేషన్ కన్వీనర్ జే. పర్వతాలు, పట్టణ కన్వీనర్ జే వంశీ కుమార్, నూతనంగా ఎన్నికైన కాటుక కురుమన్న(గోపాల్ పేట మండల కన్వీనర్), చిట్యాల కురుమన్న లు పాల్గొనడం జరిగింది.


Comments