బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కేసీఆర్

కార్పొరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్ 

బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కేసీఆర్

చిల్కానగర్, సెప్టెంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ డివిజన్‌లోని పలు కాలనీలు, బస్తీల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి, ఈ పండుగను తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా, యావత్ ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. ప్రపంచంలో దేవుళ్లను పూజించే సంప్రదాయాలు అనేకం ఉన్నా, పూలనే దేవతలుగా ఆరాధించే సంప్రదాయం మాత్రం మన తెలుగు ప్రజల్లోనే ఉందని ఆమె పేర్కొన్నారు.చిల్కానగర్ డివిజన్ బ్యాంక్ బతుకమ్మ పార్కులో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బస్తీలు, కాలనీలలో బతుకమ్మ సంపులకు కవర్లు పంపిణీ చేసి, జెసిపి సాయంతో సంపులు ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే, బతుకమ్మ నిమజ్జన సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ విభాగం ద్వారా విద్యుత్ దీపాల సౌకర్యం కల్పించామని తెలిపారు.బతుకమ్మ సంబరాల అనంతరం కార్పొరేటర్ గీత ప్రవీణ్ డివిజన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ, “చిల్కానగర్ డివిజన్ ప్రజలు, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ పిల్లాపాపలతో కలిసి సంతోషంగా దసరా పండుగ జరుపుకోవాలి” అని ఆకాంక్షించారు.IMG-20250930-WA0010

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .