పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత  

పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత  

చిల్కానగర్, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ వర్షాకాలంలో ప్రజారోగ్యం దృష్ట్యా చర్యలు చేపట్టారు. శుక్రవారం ఆమె జిహెచ్ఎంసి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పలు కాలనీలు, బస్తీలలో దోమల నివారణ రసాయనాల పిచికారీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, “డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు నివారణలో ప్రజల సహకారం ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల చుట్టుపక్కల నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. పరిసరాలు శుభ్రంగా ఉండడం మన అందరి బాధ్యత. ప్రభుత్వం, జిహెచ్ఎంసి సిబ్బంది మాత్రమే కాదని, ప్రజలు కూడా ముందుకు వచ్చి భాగస్వామ్యం కావాలి,” అని పిలుపునిచ్చారు.అదేవిధంగా, ఎంటమాలజీ విభాగం సిబ్బంది స్థానికంగా నీటి నిల్వలున్న ప్రదేశాలను గుర్తించి, డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందకుండా క్రమం తప్పకుండా పిచికారీ చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. “ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు” అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో ఏఈ నరేష్ రెడ్డి, సూపర్వైజర్ అజయ్, ఎంటమాలజీ విభాగ సిబ్బంది పాల్గొని ప్రాంతాల వారీగా శుభ్రత, పిచికారీ పనులను పర్యవేక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .