రోడ్డు సౌకర్యం లేని కోయపోష గూడెం

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతుల్లోనే* బురదలో నాట్లు వేసి నిరసన*

రోడ్డు సౌకర్యం లేని కోయపోష గూడెం

మంచిర్యాల బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

జిల్లాలోని దండేపల్లి మండలం మాకులపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసి గూడెం అయిన కోయపోష గూడెం కు రోడ్డు సౌకర్యం లేక ఆదివాసీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి తెలిపారు. శనివారం ఆయన గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తులైన ఆదివాసీ లతో కలిసి బురదలో నాట్లు వేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెయిన్ రోడ్డు నుంచి గూడెం వరకు వెళ్లే మట్టి దారి ఏ చిన్న వర్షం పడ్డ బురద గుంతలతో ఉంటుందని, దీంతో గూడెం ప్రజలకు అత్యవసర పరిస్థితులు ఏర్పాడ్డ, లేదా వైద్య అవసరాలు ఏర్పడితే ఎటు వెళ్లలేని దుస్థితిలో ఆదివాసులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఈ గూడెం ఏర్పాడి 100 సంవత్సరాలు దాటిపోయిన నేటికీ కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడం శోచనీయమని తెలిపారు. ఆ మట్టి దారి పైన ఆధారపడి వందలాది మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారని, వ్యవసాయ అవసరాలకోసం వచ్చే ఎడ్ల బండ్లు, వాహనాలతో ఆ దారిపై నడవలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆదివాసీల జీవితాల్లో మార్పు రావడం లేదనడానికి ఈ రోడ్డె నిదర్శనమని తెలిపారు.

వెంటనే సౌకర్యార్థం కోయపోష గూడెం గ్రామానికి సీసీ రోడ్డు లేదా తారు రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తక్షణమే బురద గుంటలను పూడ్చివేయాలన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిదులు, అధికారులు ఆదివాసీల గోడు వినాలని, వారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కనికరపు అశోక్, రజక సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, నాయకులు ఎల్లయ్య, రమేష్,వెంకటేష్ ,పోషన్న, సునీత, చిన్నారి,మహేశ్వరి, శ్యామల, సుజాత, ఆదివాసీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .