లంబాడీల వనభోజనం మహోత్సవ కార్యక్రమం విజయవంతం.

లంబాడీల వనభోజనం మహోత్సవ కార్యక్రమం విజయవంతం.

ఖమ్మం బ్యూరో, నవంబర్ 9, తెలంగాణ ముచ్చట్లు;

ఖమ్మం రఘునాధపాలెం ఆర్ జి బి మామిడి తోటలో ఆదివారం లంబాడి కులా ఉద్యోగ , ఉపాధ్యాయ , రాజకీయ , వ్యాపార వర్గాలకు చెందిన వేలాడి కుటుంబాలు ఏకమై కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా సాంప్రదాయ , సాంస్కృతిక పద్ధతిలో ఘనంగా జరుపుకున్నారు . మర్చిపోతున్న లంబాడీల వేసా, భాష , సంప్రదాయలను ఈతరం పిల్లలకు అర్థమయ్యేలా కట్టుబాట్లను నేర్పించి ఉన్నత చదువులు చదివించి దేశానికి సమాజానికి ఉపయోగపడేలా చూడాలి అన్నారు . రాజకీయ రంగంలో సైతం ఐక్యమత్యంగా ఉండి రాజాధికారం దిశగా అడుగులు వేయాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో కన్వీనర్ పోరిక రాములు నాయక్ , కో కన్వీనర్ భూక్య మంగ్యా నాయక్ , ట్రెజరర్ మంగిలాల్ జాదవ్ , ప్రముఖులు మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి , హరిప్రియ నాయక్ , ఖమ్మం మాజీ మేయర్ పాపాలాల్ , టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్ , కుల సంఘం నాయకులు రాజకుమార్ జాదవ్ , బిక్షపతి రాథోడ్ , బాల్ సింగ్ , జి రమేష్ , కిషన్ నాయక్IMG-20251109-WA0112 దశరధి నాయక్ , చక్రవర్తి , హదిరామ్ , పాపాలాల్ , రామారావు , బన్సీ లాల్ , సీతారాం , దేవా సింగ్ , నాగు , దాసు , గౌతమి , జ్యోతి , ఇందిరా తదితరులు పాల్గొన్నారు .

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .