మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌కు నేతల అభినందనలు

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌కు నేతల అభినందనలు

మేడ్చల్ జిల్లా, నవంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన వజ్రేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు (సీఎం ప్రజవ్యవహారాలు) వేం నరేందర్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఇద్దరు నేతలు వజ్రేష్ యాదవ్‌కు అభినందనలు తెలియజేసి, పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ శక్తివంతం కావడానికి కఠినంగా శ్రమించాలని సూచిస్తూ, 2029లో రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చూడాలంటే ప్రతి కార్యకర్తను చైతన్యవంతం చేస్తూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు.జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్త ఉత్సాహం, నూతన దిశ అందించేందుకు తమ నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని వేం నరేందర్ రెడ్డి, శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి బూపతి పాల్గొన్నారు.IMG-20251126-WA0069

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .