సీపీఐ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దాం

మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ,ఏఐవైఎఫ్ 

సీపీఐ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దాం

 మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు :      

 ప్రజా సమస్యలపై నిత్యం  కమ్యూనిస్టులు  నిరంతర పోరు సల్పిస్తారని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఘట్కేసర్ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ పిలుపునిచ్చారు.

ఆగస్టు 19-22 వరకు కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం లో జరగనున్న సీపీఐ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ,ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ లోమహాసభ ల కరపత్రాలను పంచుతూ కూపన్ల ద్వారా విరివిగా విరాళాలను సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

 ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, సీపీఐ ఘట్కేసర్ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ మాట్లాడుతూ, కుత్బుల్లాపూ ర్ లో ఆగస్టు 19-22 వరకు జరగను న్న సీపీఐ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. మహాసభల జయప్రదానికి కరపత్రాలను పంచుతూ ప్రజలను మమేకం చేయాలని తద్వారా విరివిగా విరాళాలను సేకరించాలని కోరారు. 

స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీలేనని వారు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను  అమలు చేయడంలో విఫలం చెందారన్నారు.ఇప్పటికీ నియంతృత్వ పోకడలు, అవినీతి మితిమీరిందని అన్నారు.ధరలను నియంత్రించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉపన్యాసాలు ఇస్తున్నారే కానీ కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. గవర్నర్ ల వ్యవస్థ తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. 

స్వతంత్ర వ్యవస్థలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మహాసభల విజయవంతానికి ప్రతి ఒక్క కార్యకర్త , నాయకులు పోటీ పడి పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో   ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి.సత్య ప్రసాద్, సీపీఐ జిల్లా సీనియర్ నాయకులు కల్లూరు జయచంద్ర, ఏఐవైఎఫ్ ఘట్కేసర్ మండల కార్యదర్శి సంపంగి శివ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .