రూ.2లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి
రైతు భరోసా 15000 చెల్లించాలి.
ఏఐకేఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు.
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలైన 2లక్షల రుణమాఫీ, రైతు భరోసా తక్షణమే అమలుచేయాలని తెలంగాణ రాష్ట్రరైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం చింతకాని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డియాండ్ చేశారు. రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఎటువంటి షరతులు లేకుండా చేయాలని ప్రభుత్వం చెబుతున్న నూరుశాతం రుణమాఫీ జరగలేదన్నారు. లక్షలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఆశలు పెట్టుకున్నారన్నారు. దానిని అమలు చేయాల్సిన భాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. చనిపోయినవారికి, పట్టాదారు పాసుపుస్తకంలేని వారికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నవారికి రుణమాఫీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతుభరోసా పెట్టుబడి క్రింద ఇచ్చే సహాయం ఖరీఫ్ పూర్తయి రభీ ప్రారంభమైనా నేటికి రైతుభరోసా అందించలేదన్నారు. ప్రభుత్వం తక్షణం ఎటువంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ అమలు చేసి రెండు సీజన్లకు సంభంధించి రైతుభరోసా ఎకరానికి రూ.15000/- అందిచాలన్నారు. వరికి బోనస్ అందరికి అందించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ తెచ్చిన నల్లచట్టాలను తక్షణమే రద్దుచేయాలని స్వామినాధన్ కమీషన్ సిఫార్సులు అమలుచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ అక్బర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐకెఎస్ రాష్ట్ర నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వేపూరి రవీంద్రబాబు కోశాధికారి కూచిపూడి రవి, సిపిఐ మండల కార్యదర్శి పావులూరి మల్లికార్జునరావు, ఏఐకెఎస్ మండలాధ్యక్షుడు మార్గం శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పగిడిపల్లి ఏసు, నాయకులు తాళ్లూరి యాదగిరి, పదిమల వెంకట నరసయ్య గోగుల ఆది , బాలాజీ రావు, నక్కనబోయిన కృష్ణ, పెరిక ప్రభాకర్, రాయల గోవిందరావు జానకి రాములు తదితరులు పాల్గొన్నారు..jpeg)


Comments