షరతులు లేకుండా రుణమాఫీ పూర్తి చేయాలి 

సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి

షరతులు లేకుండా రుణమాఫీ పూర్తి చేయాలి 

తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:

రెండు లక్షల వరకు రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసి అమలులో అనేక నిబంధనలను విధించి రైతుల సంఖ్య కుదింపు చేయడం సరికాదని, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ శంకరయ్యకు అందజేశారు. అనంతరం గుండెబోయిన రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సోమయ్యమాట్లాడుతూ... రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు రోజుకో ప్రకటన చేయడంతో రైతుల్లో గందరగోళం నెలకొందని,తుది విడత గడువు ప్రకటించి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. ఎన్నికలు నాడు ఏక కాలంలో రెండు లక్షలు వరకు రైతు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి, రాష్ట్రంలో లక్షల మందిరైతులు ఉంటే కేవలం కొంత మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో రైతులందరూ ఏకం చేసి ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాట సుధాకర్, వేల్పుల రవి,నక్క యాకయ్య,  వడ్లకొండ సుధాకర్, నల్లతీగల శీను, గంగరాజు ,వేల్పుల రామన్న, అజయ్, ఎం.డి శంషోదీన్, వడ్లకొండ రాజు,వేల్పుల సంపత్ ,వేల్పుల చిన్న రాములు, పులిగిల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .