ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జయంతి లాల్‌కు ఎల్ఓసీ అందజేత
మల్కాజిగిరి, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి డివిజన్ రాధాకృష్ణ నగర్ కాలనీకి చెందిన జయంతి లాల్ అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం చేసిన వినతి మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2,00,000 విలువైన ఎల్ఓసీ మంజూరైంది.శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమోదం పొందిన ఎల్ఓసీని ఆయన, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్‌తో కలిసి బోయిన్‌పల్లి క్యాంప్ ఆఫీసులో బాధితుడికి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “సీఎం సహాయనిధి నిరుపేద లు, ఆర్థికంగా బలహీనులైన ప్రజలకు అనారోగ్య సమయం లో ఆపన్న హస్తంలా సహాయం చేస్తోంది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు.ఎల్ఓసీ అందుకున్న జయంతి లాల్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, చిన్న యాదవ్, నవీన్, మధుసూదన్ రెడ్డి, శివ గౌడ్, సుమన్ గౌడ్, సుమన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


Comments