బంజారా లలో జ్ఞాన జ్యోతిని వెలిగించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ హల్ లో జరిగిన శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస రావు పాల్గొని వారిచిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి ఉత్సవం జరిపినారు .ఈ కార్యక్రమం ఉద్దేశించి వక్తలు సంత్ సేవాలాల్ మహరాజ్గరు, హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శ పురుసుడయ్యారు. సేవాలాల్ మహరాజ్ ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో న్యాయవాదులు మందడపు. శ్రీనివాస రావు తౌఫిక్ తొండపు వెంకటేశ్వర రావు సుగ్గుల వెంకట్ గుప్తా తాళ్లూరి దిలీప్ చౌదరి గద్దల దిలీప్ ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్రి ప్రకాష్ దారవత్ వీరన్న రవీందర్ నాయక్ ప్రసాద్ నాయక్ వరుణ్ నాయక్ రాందాస్ నాయక్ భూక్యా నాగేశ్వరావు అరవింద్ జైదీప్ కోపిల రవికుమార్ ఇందిర నంధిత దుర్గ హరి నాయక్ వెంక్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments