మాల దాసరిలను గ్రూప్-1లో చేర్చాలి

మాల దాసరిలను గ్రూప్-1లో చేర్చాలి

మాల దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి,
అమ్మానాన్న ఫౌండేషన్ చైర్మన్ రేండ్ల సమ్మయ్య

స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు:

మాల దాసరి (హరిదాసుల) వర్గీకరణను సరిచేసి,మాకు న్యాయం చేయాలని మాల దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి,అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్ రేండ్ల సమ్మయ్య డిమాండ్ చేశారు. రిజర్వేషన్ మార్పుల పేరుతో మాల దాసరి హరిదాసులను అభివృద్ధి చెందిన గ్రూప్-సి లో చేర్చి, వారి హక్కులను హరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

“సంక్రాంతి ముందు భోగి పండుగ రోజున మేము ఆడే పాడే పాటలతో మాల దాసరిలు  హరిదాసులుగా గుర్తింపబడుతుండేవారం.కానీ ఇప్పుడు మాల దాసరులను మాల దాంట్లోని ఉపకులాల్లో విలీనం చేసేశారు.ఇది మాల దాసరి (హరిదాసుల) హక్కులపై జరుగుతున్న అన్యాయానికి స్పష్టమైన ఉదాహరణ” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“మాల దాసరి (హరిదాసు)లను వేరే ఉపకులాల్లో కలిపే బదులు, సంచార జాతుల్లో ఒక్కటిగా గుర్తించి, మాల దాసరి కుటుంబాలను గ్రూప్-1లో చేర్చే వరకు మా పోరాటం ఆగదని,
ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే, పదివేల మంది మాల దాసరి హరిదాసుల వేషధారణలో గాంధీభవన్‌ను ముట్టడిస్తాం” అని రేండ్ల సమ్మయ్య హెచ్చరించారు.
ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిష్కరించే వరకు మాల దాసరి (హరిదాసు)ల పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .