మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 22, తెలంగాణ ముచ్చట్లు:
దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.పోలీస్ శాఖ మహిళలు బతుకమ్మ ఆడేటువంటి ప్రాంతాల్లో, దుర్గామాత అమ్మవారు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, పెట్రోలింగ్, విజబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వేడుకలు జరిగే అన్ని ప్రాంతాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఉత్సవాలు సజావుగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అగ్ని ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అన్ని దుర్గామాత విగ్రహాలను జియో ట్యాగ్ చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా మహిళలు తమ ఇళ్ల ముందు బతుకమ్మ ఆడతారు కాబట్టి బహిరంగ ప్రదేశాలు అవసరమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.


Comments