అడ్డకల్ ఎస్సై చొరవతో ప్రేమజంటకు వివాహం

అడ్డకల్ ఎస్సై చొరవతో ప్రేమజంటకు వివాహం

మహబూబ్‌నగర్,అక్టోబర్4(తెలంగాణ ముచ్చట్లు):

అడ్డాకల్ మండలం కందూర్ గ్రామానికి చెందిన ముష్టి శివ (బిసి), దోమ రాధ (ఎస్‌సి-మాదిగ, వయసు 22) గత ఏడాది నుండి ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో శివ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి యువతిని గర్భవతిని చేశాడు. అనంతరం పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు జిల్లా అదనపు పోలీసు అధికారి రత్నం కు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు అదనపు పోలీసు అధికారి పర్యవేక్షణలో, అడ్డకల్  ఎస్సై శ్రీనివాస్ చొరవతో ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి వివరణ కోరారు. ఈ సందర్భంగా ముష్టి శివ పెళ్లి చేసుకుంటానని, దోమ రాధ పేరుమీద ఒక ఎకరం భూమి రిజిస్టర్ చేసి ఇస్తానని అంగీకరించాడు.దీంతో  అక్టోబర్ 4, శనివారం ఉదయం  9 : 30 నిమిషాలకు కందూర్ రామాలయంలో పెద్దల సమక్షంలో ముష్టి శివ, దోమ రాధలకు పెళ్లి జరిపించారు. పెళ్లి అనంతరం శివ తన భార్యను మంచిగా చూసుకుంటానని, కుటుంబ సభ్యులు రాఘవేందర్, వదిన, కొత్త శీను బావ, అక్క రాధకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  కందూర్ గ్రామానికి చెందిన కొత్త శ్రీను, బోయ రమేష్, గట్టు నరేందర్, దోమ కరెన్న, వెంకటయ్య, రాంచందర్, ఓపాలా కృష్ణయ్య, రాములు, మంగరాయి వెంకటేశ్వర్లు, యాదయ్య, దయాకర్, నరేందర్ గౌడ్, అంజి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .