మాస్టర్ మైండ్ డెక్కన్ 20 స్వచ్ఛంద సంస్థ సహకారం మరువలేనిది 

పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేయడం అభినందనీయం 

మాస్టర్ మైండ్ డెక్కన్ 20 స్వచ్ఛంద సంస్థ సహకారం మరువలేనిది 

-- రైజింగ్ హాండ్స్ సొసైటీ టీమ్ సభ్యులు 

వనపర్తి,తెలంగాణ ముచ్చట్లు:

మాస్టర్ మైండ్ డెక్కన్ 20 స్వచ్ఛంద సంస్థ వారు చేస్తున్న సహకారం మరువలేనిదని పెద్దమందడి రైజింగ్ హ్యాండ్స్ సొసైటీ టీమ్ సభ్యులు అన్నారు.పెద్దమందడి మండల కేంద్రంలో..రైజింగ్ హాండ్స్ సొసైటీ టీమ్ వారి ఆధ్వర్యంలో  
పెద్దమందడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు  హైదరాబాద్ మాస్టర్ మైండ్ డెక్కన్ 20' స్వచ్ఛంద సేవ సంస్థ వారి సహకారంతో పాఠశాల పిల్లలకు మరుగుదొడ్లు నిర్మించడం మరియు డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం హైదరాబాద్ నుండి వచ్చిన మాస్టర్ మైండ్ డెక్కన్ 20' వారు మరుగుదొడ్లను మరియు డైనింగ్ టేబుల్ ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది.ఈ సందర్భంగా రైజింగ్ హాండ్స్ సొసైటీ టీమ్ సభ్యులు మాట్లాడుతూ.. మాస్టర్ మైండ్ సేవ సంస్థ వారు మా పాఠశాల అభివృద్ధికై, మా విద్యార్ధుల భవిష్యత్తుకై ఎంతో కృషి చేస్తున్నారు వారు అందిస్తున్న ఈ సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది...
వారు ఇప్పటికీ పాఠశాల అధునాతన సాంకేతిక మార్పుకోసం దాదాపు 2,70,000/- ఖర్చు చేశారు.
వారికి మా రైజింగ్ హాండ్స్ సొసైటీ టీమ్ తరపున మా విద్యార్ధుల తరుపున మా కాలనీ ప్రజలందరి తరుపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని తెలిపారు...ఈ కార్యక్రమంలో 
మాస్టర్ మైండ్ డెక్కన్ 20 సేవ సంస్థ వారు...రైజింగ్ హాండ్స్ సొసైటీ టీమ్ సభ్యులు మరియుశ్రీ బత్తుల చెన్న కేశవులు 
స్కూల్ హెడ్ మాస్టర్ గోవర్ధన్,   టీచర్లు మరియు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .