భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
-ప్రజలందరూ భక్తి భావంతో మెలగాలి
-అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది
అన్నదానం నిర్వహించిన కొర్ర రమేష్ నాయక్ దంపతులు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలను అందిస్తున్న సందర్భంగా పూజను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొర్ర రమేష్ నాయక్ వారి కుటుంబ సమేతంగా గణనాథుడికి పూజలో పాల్గొని ఉరువడా అంత గ్రామంలో ప్రజలకు ఏ అడ్డంకులు ఏ వ్యాధులు ప్రబలకుండా సుఖ సంతోషాలతో ఉండాలని వెడుకున్నట్లు వారు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని కుల మత బేధం లేకుండా ప్రజలందరూ కలిసి మెలసి ఉండాలని ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలకు ఉండాలని మరియు జీవించాలని వేడుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ దైవ సన్మార్గంలో నడిచినట్లయితే శాంతి ముక్తి మార్గం లభిస్తుందని రమేష్ నాయక్ అన్నారు. గణేష్ మండపం వద్ద కొర్ర రమేష్ నాయక్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పదని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కూసుమంచి మండలం ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కంచర్ల జీవన్ రెడ్డి మాదాసు పేందర్ పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని అదేవిధంగా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ అన్న ప్రసాదాన్ని గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువత కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. కుల మతాలకతీతంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతోపాటు సేవా దృక్పథం అలవాటవుతుందని గ్రామంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ లోక కళ్యాణార్ధం క్షేమం కోసం పూజలు అన్నదనాల్లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.


Comments