భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

-ప్రజలందరూ భక్తి భావంతో మెలగాలి

భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

IMG-20240913-WA0030-అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

గుడి చైర్మన్, వైస్ చైర్మన్ పదిమల వెంకట నరసయ్య, గడ్డం రామారావు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

చింతకాని మండలం నాగలిగుండా గ్రామంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలను అందిస్తున్న సందర్భంగా శుక్రవారం నాడు నాగిలి గుండా గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహం వద్ద పూజా కార్యక్రమంలో పీటల మీద కూర్చున్న దంపతులు ఆలయ చైర్మన్ పదిమల వెంకట్ నరసయ్య రమాదేవి కుటుంబ సమేతంగా గణనాథుడికి పూజలో పాల్గొని ఉరువడా అంత గ్రామంలో ప్రజలకు ఏ అడ్డంకులు ఏ వ్యాధులు ప్రబలకుండా సుఖ సంతోషాలతో ఉండాలని వెడుకున్నట్లు వారు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని కుల మత బేధం లేకుండా ప్రజలందరూ కలిసి మెలసి ఉండాలని ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలకు ఉండాలని మరియు జీవించాలని వేడుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ దైవ సన్మార్గంలో నడిచినట్లయితే శాంతి ముక్తి మార్గం లభిస్తుందని వైస్ చైర్మన్ గడ్డం రామారావు అన్నారు. ఈ అన్న ప్రసాదాన్ని గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువత కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. కుల మతాలకతీతంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతోపాటు సేవా దృక్పథం అలవాటవుతుందని గ్రామంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ లోక కళ్యాణార్ధం క్షేమం కోసం పూజలు అన్నదనాల్లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో శ్రీ గణేశ ఉత్సవ కమిటీ సభ్యులు, పాలకవర్గ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్త మహాశయులు, అర్చకులు, అధికారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .