మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి
-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
విద్యార్థులకు మెనూ ప్రకారం దైనందిన భోజనం అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రం లోని షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కళాశాల బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ఆకస్మిక తనిఖీ చేశారు.
వసతి గృహం లోని వివిధ వసతులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు భోజన శాల, తాగునీటి సౌకర్యం, శానిటరీ,, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు విద్యార్థులకు అందిస్తున్న దైనందిక భోజన సౌకర్యాలను విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు సక్రమంగా అందే విధంగా చూడాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా విద్యార్థులతో కమిటీ ఏర్పాటు చేసి మెనూ ప్రకారంగా భోజన సౌకర్యం కల్పిస్తున్న దైనందిక రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. తాగునీటి సౌకర్యం సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన ఫిల్టర్ పాయింటును ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ జిల్లా అధికారిణి శ్రీలత, గిరిజన సంక్షేమ అధికారి ప్రేమలత, వసతి గృహాల సంక్షేమ అధికారి కృష్ణ, హాస్టల్ వార్డెన్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Comments