సాకేత్ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

సాకేత్ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాప్రా, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సాకేత్ కాలనీ అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.బుధవారం కాప్రా డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీలో రూ.44 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు మరియు స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే ప్రధాన అతిథిగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — సాకేత్ కాలనీలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని, ప్రజల అభ్యర్థనల మేరకు అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు భైరీ నవీన్ గౌడ్, సాకేత్ కాలనీ అధ్యక్షులు జి.ఎస్.రావు, జాయింట్ సెక్రటరీ రవీందర్ రావు, కోశాధికారి చంద్రశేఖర్, రాజేశ్వర్ రావు, నిరంజన్ రావు, జగన్నాథ రావు, శ్రీనివాసరావు, సాకేత్ స్వర్ణ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .