అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:
వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ పరిధిలోని హాసన్ పర్తి ఎస్సీ కాలనీలో సుమారు 2కోట్ల 90లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్,డ్రైనేజ్ నిర్మాణ పనులకు,65వ డివిజన్ పరధిలోని దేవన్నపేట గ్రామంలో సుమారు 3 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు,డ్రైనేజినిర్మాణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు.అనంతరం డివిజన్ పరధిలో సుమారు 11లక్షల విలువ గల కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దశల వారిగా అన్ని డివిజన్ల లో సైడ్ డ్రైన్, సీసీ రోడ్ల పనులను చేస్తున్నామని రోడ్డు నిర్మాణ పనుల్లో స్థానిక కాలనీ వాసులు ప్రభుత్వానికి సంహరించాలని కోరారు.కాలనీలలో ఎటువంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా పరిష్కరం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడేడ్ల మాదిరి సాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు లు, ఆరోగ్య శ్రీ కార్డులు అందిచామని మళ్ళీ నేటి ఇందిరమ్మ ప్రభుత్వంలో త్వరలో అర్హులకు రేషన్ కార్డులను,డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారికీ ప్రభుత్వం సన్నద్ధం అవుతుందాన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధంగా ఉందన్నారు. డిజిటల్ రేషన్, హెల్త్ కార్డుల ప్రక్రియకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఒక పట్టణం, ఒక గ్రామాన్ని ఎంచుకునే విషయాన్నీ గుర్తు చేశారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రైతు రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వమని సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వనున్నారని తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు. ప్రజలందరూ బిఆర్ఎస్,బిజెపి నాయకుల మాయమాటలకు మోసపోకుండదని కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్,అయ్యల రాంరెడ్డి,కార్పొరెటర్స్ అరుణా కుమారి,దివ్యరాణి,మార్కట్ వైస్ చైర్మన్ తంగళ్లపల్లి తిరుపతి,కిసాన్ సెల్ జిల్లా అద్యక్షుడు పింగళి వెంకటరాంనర్సింహారెడ్డి,జిల్లా ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్ కుమార్, వీసం సురేందర్ రెడ్డి,ఆరెల్లి వెంకట స్వామి,పోతరాజు ప్రభాకర్,వింజమూరి వెంకన్న,శ్రీనివాస్ రెడ్డి,చంటి రెడ్డి,సునిల్ తదితరులు పాల్గొన్నారు.


Comments