అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వివరాలు

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వివరాలు

మల్కాజ్గిరి, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి వినాయక్‌నగర్ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ బద్దం పుష్పలత, పరశురాం రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన వివరాలు వెల్లడించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజ్గిరి చక్రబంధం నుంచి విముక్తి కోసం భారీగా నిధులు రాబట్టి పలు ప్రాజెక్టులకు అనుమతులు పొందినట్లు తెలిపారు.ముఖ్య అభివృద్ధి పనులు:వాజ్పేయి నగర్ ఆర్‌యు‌బి (అండర్‌పాస్): రూ.74.47 కోట్లు (జలమండలి రూ.10 కోట్లు, భూసేకరణ రూ.8 కోట్లు, విద్యుత్ శాఖ రూ.3 కోట్లు, సర్వీస్ రోడ్లు-డ్రైనేజీ రూ.85 లక్షలు, వెడల్పు 9 మీ., ఎత్తు 5 మీ., పొడవు 103 మీ.)
ఆర్‌.కే.పురం ఫ్లైఓవర్: రూ.210 కోట్లు ఆర్‌యు‌బి: రూ.35 కోట్లు ఏఓసి రోడ్లు అభివృద్ధి: రూ.464 కోట్లు ల్యాండ్ స్వాప్ (భూమి మార్పిడి): రూ.442 కోట్లు తుర్కపల్లి ఆర్‌యు‌బి: రూ.5 కోట్లు జనప్రియ ఆర్‌యు‌బి: రూ.6.6 కోట్లు.గౌతమ్ నగర్ ఆర్‌యు‌బి: రూ.28 కోట్లు గౌతమ్ నగర్ 5 ఎంఎల్‌డి రిజర్వాయర్: రూ.14.95 కోట్లు సఫిల్గూడ యూపీహెచ్సీ: రూ.1.43 కోట్లు (500 గజాల ప్రభుత్వ స్థలం) జిల్లా కోర్టు భవనం నిర్మాణం: రూ.42 కోట్లు అల్వాల్ ఫైర్ స్టేషన్: 11 గుంటల ప్రభుత్వ భూమి కేటాయింపు (జిహెచ్ఎంసి ఆమోదం కోసం కృషి)
డిగ్రీ కాలేజ్ మౌలిక వసతులు: రూ.2 కోట్లు (జిల్లా కలెక్టర్ మను చౌదరి సహకారంతో)
విద్యుత్ శాఖ అభివృద్ధి పనులు: రూ.42 కోట్లు (సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సింగిల్ ఫేస్ టు త్రీ ఫేస్ మార్పిడి)జిహెచ్ఎంసి పనులు: అనేక సీసీ రోడ్లు, బాక్స్ డ్రైన్లు ఈ అభివృద్ధి కార్యక్రమాల సాధనలో మద్దతు అందించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి, జిహెచ్ఎంసి, రైల్వే, విద్యుత్ శాఖల అధికారులు,కార్పొరేటర్లు, నాయకులు, సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు:
కార్పొరేటర్ మేకల సునీత, రాము యాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, ఏకే మురుగేష్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి, జెఎసి వెంకన్న, జీకే హనుమంతురావు, చిన్న యాదవ్, ఉస్మాన్, శివ గౌడ్, హేమంత్ పటేల్, వంశీ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, యువత, మహిళలు హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .