పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి కాంట్రాక్ట్ కార్మికుల ఆత్మీయ సత్కారం
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :
సింగరేణి వ్యాప్తంగా వివిధ గనులు డిపార్ట్మెంట్ లలో పనిచేస్తున్న ముప్పయి వేలమంది కాంట్రాక్ట్ కార్మికులకు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, ఓబి వర్కర్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలలో గత మంగళవారం నాడు సమస్యను అసెంబ్లీ దృష్టికి తీసుకురావడంతో పాటు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కూడా ప్రత్యేకించి కలిసి వినతి పత్రం అందజేయడం పట్ల మణుగూరు ఏరియా కాంట్రాక్ట్ కార్మికుల తరఫున ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని కాంట్రాక్ట్ కార్మికులు శాలువాతో ఆత్మీయంగా సత్కరించారు. బుద్దిస్ట్ సంఘం ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వ జీవో ద్వారా వేతనాలు పెంచడం లేదా హై పవర్ కమిటీ వేతనాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసేంతవరకు మీరు మరింత స్ఫూర్తి దాయకంగా ఈ సమస్య పరిష్కారానికి మరింతగా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పలు సమస్యలపై పాయం వెంకటేశ్వర్లు కి వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్ట్ వర్కర్ల, ఓబి వర్కర్ల, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల, ప్రైవేటు వాహన డ్రైవర్ల మరియు సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమానికి సంబంధించి కూడా ఈ క్రింది సమస్యలు పరిష్కరించాలని ఆయన ఎమ్మెల్యే ని కోరారు.సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు లేదా రాష్ట్ర ప్రభుత్వ జీవో అమలు చేసి వేతనాలు పెంచాలి,సింగరేణిలో అమలవుతున్న అమానవీయ పెనాల్టీ రద్దుకు తగు చర్యలు చేపట్టాలి,సింగరేణి సివిల్ సెక్యూరిటీ మరియు పర్చేజ్ ఓబి విభాగాలలో నిర్వాసితులకు, ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు డిపెండెంట్ లకు మరియు స్థానికులకు ఎనభై శాతం ఉపాధి కల్పించాలి, ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ప్రైవేటు వాహన డ్రైవర్లకు ఓబి వర్కర్లకు కేటాయించాలి.అన్ని విభాగల సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రైవేటు సెక్యూరిటీ కార్డులకు వాహన డ్రైవర్లకు ఓబి వర్కర్లకు వారి కుటుంబ సభ్యులకు ఐఎస్ఐ వైద్య సేవలు వర్తింప చేయాలి ప్రమాద బీమా మరియు బయట ప్రమాదాలకు భీమా పథకాలు అమలు చేయాలి.సింగరేణిలో కూడా ఉచిత వైద్యం మరియు వారి పిల్లలకు ఉచిత విద్య అందజేయాలి ,అన్ని విభాగాల కాంట్రాక్ట్ వర్కర్లకు ప్రతినెల ఏడవ తేదీలోగా వేతనాల చెల్లింపుకు చర్యలు చేపట్టాలి, అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి,సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంటాక్ట్ కార్మికులను సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్లుగా గుర్తించాలి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి ఐదు వేల రూపాయలు చెల్లించాలి, సెంట్రల్ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి ,సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి ఎమ్మెల్యే గారు తమ అనుభూతిని వ్యక్తం చేస్తూ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచే వరకు శక్తివంతం లేకుండా కృషి చేస్తారని ఆయన కాంటాక్ట్ కార్మికుల హర్షద్వారాల మధ్య ప్రకటించారు. ఇతర సంక్షేమ పథకాలు కూడా వర్తించే విధంగా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, ఆంగోత్ మంగీలాల్, నల్లా రమేష్, సాధన పల్లి రవి, వై సంజీవరావు, పి వెంకటేశ్వర్లు, టి రాములు, కృష్ణ, జి శ్రీనివాస్, జె నాగయ్య, యు శివరామకృష్ణ, కే నాగేశ్వరరావు, కే గురుమూర్తి, జీ తులసి, కే రమణ ఎస్ లక్ష్మి, ఎస్ నళిని, టి మౌనిక, వి లక్ష్మి, ఎం సమ్మక్క, బి విజయ కుమారి, రాజేశ్వరి, కౌసల్య, జయకుమారి, ఎస్ వసంత, కె సడాలు,జిమోహన్,నాగమణి,పి రేణుక, చంటి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.


Comments