షాపూర్ లో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

బహుజన వీరుడు పండుగ సాయన్న

షాపూర్ లో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
బహుజన వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి

--ఎమ్మెల్యే మేఘా రెడ్డి   


వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

 వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం షాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో  ఎమ్మెల్యే పాల్గొని పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షాపూర్ గ్రామ ముదిరాజ్ సంఘం  తో పాటు  గ్రామం ప్రజలు ఎంతో  ఐక్యతగా ఏర్పడి గ్రామంలో పండుగొల్ల  సాయన్న లాంటి సాహస వీరుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.షాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని మొట్టమొదటగా గ్రామంలో ఇల్లు లేని నిరుపేదల ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా ప్రజలంతా ఐక్యంగా ఉండి వారిని గుర్తించాలని ఎమ్మెల్యే గ్రామస్తులకు సూచించారు.అనంతరం గ్రామస్తులు నాయకులు ఎమ్మెల్యే గారికి శాలువాలతో సన్మానం చేశారు.కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .