స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే యశస్విని

స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే యశస్విని

యాదాద్రి,తెలంగాణ ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని ప్రముఖ వైష్ణవ ఆలయం స్వర్ణగిరి స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ, స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందకరమని, స్వర్ణగిరి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందనీ, మరింత అభివృద్ధి సాధించేందుకు స్వామి వారి ఆశీస్సులు అవసరమని పేర్కొన్నారు.

ఇదే సందర్భంలో తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం బాగుండాలని, పాడి పంటలు సస్యశ్యామలం కావాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .