సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి

మీడియాపై దాడికి నిరసనగా ఖమ్మంలో జర్నలిస్టుల ర్యాలీ సీపీకి ఫిర్యాదు 

సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి

సినీ నటుడు మోహన్ బాబుది ఉన్మాద చర్య 

టీయూడబ్ల్యూజే టి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

 రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఘటనలో జర్నలిస్టులు తీవ్ర గాయాలు పాలయ్యారని, దీనికి కారకులైన సినీ నటుడు మోహన్ బాబు పై కఠిన చర్యలు తీసుకొని తక్షణమే అతన్ని అరెస్టు చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( టి జె ఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ డిమాండ్ చేశారు. మోహన్ బాబుది ఉన్మాద చర్య అని, ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా టియుడబ్ల్యూజే (టీఎజేఎఫ్) హెచ్-143 రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మంలో యూనియన్ సభ్యులు కదంతోక్కారు. టి యు డబ్ల్యు జే (టి జె ఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ నేతృత్వంలో నల్ల జెండాల ర్యాలీ నిర్వహించారు. 
అహంకారపూరితంగా మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ ఖమ్మం ప్రెస్ క్లబ్ నుంచి అమరవీరుల స్థూపం  మయూరి సెంటర్, పాత బస్టాండ్, మీదుగా జిల్లా పరిషత్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు,  నల్ల జెండాల చేతబూనిన టీజేఎఫ్ జర్నలిస్టుల బృందం నాయకులు, జర్నలిస్టు ప్రతినిధులు మోహన్ బాబును తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అకారణంగా దాడి చేసిన మోహన్ బాబు జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు.

 పోలీసు ఉన్నతాధికారులు , రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని మోహన్ బాబు, ఆయన అనుచరులు, సెక్యూరిటీ  సిబ్బంది మీద  కేసులు నమోదు చేసి , కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.. డౌన్ డౌన్ మోహన్ బాబు. జర్నలిస్టు మీద దాడి సిగ్గు సిగ్గు అంటూ ఖమ్మం పట్టణంలో భారీ ర్యాలీ కొనసాగించారు. మోహన్ బాబు పై తక్షణం చర్యలు తీసుకోవాలని , లేదంటే ఆందోళనలు,  నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని  పోలీసులకు , రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. 

ర్యాలీ అనంతరం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని కలిసి టియుడబ్ల్యూజే (టీజేఎఫ్) పక్షాన జర్నలిస్టు ప్రతినిధులు,నాయకులు ఫిర్యాదు కాపీ అందజేశారు . అకారణంగా జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారని. మీడియా ప్రతినిధులను గాయపరిచి అవమానపరిచి, న మోహన్ బాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 జర్నలిస్టులపై దాడులు సరైనది కాదని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఖమ్మం జిల్లా పోలీసులు చర్యలు చేపట్టాలని టీయూడబ్ల్యూజే 
 జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ కోరారు. 

WhatsApp Image 2024-12-11 at 9.43.01 PMఈకార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, రాష్ట్ర నాయకులు టీన్యూస్ సాంబశివరావు, అడపాల నాగేందర్ , ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు వెలుగు ప్రశాంత్ రెడ్డి, ఆర్టీవీ ఉదయ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి రమేష్ బాబు, నగర కార్యదర్శి అమరవరపు  కోటేశ్వర్ రావు, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు యల్లమందలజగదీశ్, ప్రధాన కార్యదర్శి అశోక్, జిల్లా నాయకులు చక్రవర్తి, జానీ పాషా, మదర్ సాహెబ్, ముత్యాల కోటేశ్వరరావు, బిక్కీగోపి, జీవన్ రెడ్డి, సాయి, కొరకొప్పుల రాంబాబు, పిన్ని సత్యనారాయణ,హరీష్, గణేష్, అంతోటి శ్రీనివాస్ , తిరుపతిరావు,మోహన్, రవి, శ్రీధర్, నర్సింహరావు , నల్లమోతు శ్రీనివాస్ , మురళి, పానకాల రావు, రోషి రెడ్డి , సంతోష్, మందుల వెంకటేశ్వర్లు, రామ్ చందర్ ,నాగేష్, మంద వెంకటేశ్వర్లు, రంజాన్ ,మహిళా జర్నలిస్ట్ రోజా, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .