హైకోర్టు ఏజీపీ హంసు వర్మ నిశ్చితార్థానికి హాజరైన ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి
వనపర్తి,అక్టోబర్12(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ) హంసు వర్మ -రాధిక నిశ్చితార్థ వేడుక రంగారెడ్డి జిల్లా కందుకూర్ సమీపంలోని బి.ఆర్.ఆర్. గార్డెన్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి ,బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి వారు హంసు వర్మ-రాధిక జంటకు పుష్పగుచ్ఛాలు అందించి ఆశీస్సులు అందజేశారు.వేదికను పూలతో అలంకరించడం, సాంప్రదాయ వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు సందడి వాతావరణం నెలకొంది. వధూవరుల కుటుంబ సభ్యులు, మిత్రులు, ఆత్మీయులు అందరిని ఆతిథ్యంతో ఆహ్వానించారు.నిశ్చితార్థ వేడుకలో ముఖ్య అతిథులుగా ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే మేఘా రెడ్డి పాల్గొని హంసు వర్మ సేవాభావం, న్యాయరంగంలో ఆయన కృషి, వినయశీలతను ప్రశంసించారు. హంసు వర్మ – రాధిక జంట జీవితంలో ఆనందం, సౌభాగ్యం నిండాలని అందరూ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments