ఎంఆర్ పిఎస్ ముప్పారం గ్రామ కమిటీ ఎన్నిక 

-గ్రామ శాఖా అధ్యక్షులుగా గోల్లపల్లి అనిల్ 

ఎంఆర్ పిఎస్ ముప్పారం గ్రామ కమిటీ ఎన్నిక 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు: ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) గ్రామ కమిటీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, ముప్పారం గ్రామంలో బుధవారం గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోంపేల్లి అన్వేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గంగారపు శ్రీనివాస్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి,జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ హాజరయ్యారు.

గ్రామ కమిటీ నాయకత్వం
సమావేశంలో గోల్లపల్లి అనిల్ మాదిగ ను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా, చిట్యాల భారత్ మాదిగ ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు.ఉపాధ్యక్షులుగా కందుకూరి శ్రీనివాస్ మాదిగ, కందుకూరి ప్రభాకర్ మాదిగ,సహాయ కార్యదర్శి కందుకూరి అజయ్ చెందర్ మాదిగ,కార్యవర్గ సభ్యులు కందుకూరి సంబరాజ్, కందుకూరి వెంకటస్వామి, చిట్యాల రమేష్, చిట్యాల గణేష్, వస్కుల శ్రీకాంత్ తదితరులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా డిసెంబర్ 21, 2024న నిర్వహించబోయే ధర్మయుద్ధ మహాసభ ను విజయవంతం చేయడంలో భాగంగా ఈ కమిటీ ఏర్పాటు చేయబడిందని,మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో కమిటీలను బలపరిచేందుకు మండల వ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు గంగారపు శ్రీనివాస్ మాదిగ తెలిపారు. గ్రామస్థాయి నాయకులు ఒక బలమైన వ్యవస్థగా పనిచేసి, మాదిగ రిజర్వేషన్ల కోసం సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ కమిటీ ఏర్పాటు ద్వారా స్థానిక సమస్యల పరిష్కారానికి,ప్రజల హక్కుల కోసం పోరాటానికి మద్దతు పెరగనుందని పేర్కొన్నారు.గ్రామ కమిటీ సభ్యులు,హాజరైన ప్రతినిధులు, డిసెంబర్ 21న నిర్వహించనున్న ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయడానికి తమవంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .