పోగొట్టుకున్న 13 మొబైల్ ఫోన్లను బాధితులకు  అప్పగించిన ముదిగొండ ఇన్స్‌పెక్టర్

పోగొట్టుకున్న 13 మొబైల్ ఫోన్లను బాధితులకు  అప్పగించిన ముదిగొండ ఇన్స్‌పెక్టర్

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

పోగొట్టుకున్న 13 మొబైల్ ఫోన్లను  సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు ముదిగొండ ఇన్స్‌పెక్టర్ మురళీ తెలిపారు.
బాధితులు పోగొట్టుకున్న/చోరీకి గురైన మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో మొబైల్ ఫోన్ ట్రాక్ చేసిన సైబర్ సెల్ బృందం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనలతో ముదిగొండ పోలీస్ స్టేషన్ లోయజమానులకు ఇన్స్‌పెక్టర్ చేతుల మీదుగా అప్పగించారు. ఈ సందర్భంగా ముదిగొండ ఇన్స్‌పెక్టర్ మాట్లాడుతూ...సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ పోర్టల్ విధానంతో సుమారు రెండు లక్షల విలువ గల 13 ఫోన్లను బ్లాక్‌ చేసి,వాటిని ట్రేస్‌ చేసి, నిజమైన యజమానులకు అప్పగించినట్లు తెలిపారు.
ఒక్కొక్క మొబైల్ ఫోన్ లక్ష యాబై వేల నుండి 10 వేల రూపాయలు ఖరీదు గల ఫోన్లను ట్రాక్ చేయడం జరిగిందన్నారు.  ప్రస్తుత జీవన శైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలక పరికరం అయ్యిందని, ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్న.. నగదు లావాదేవీలు చేయాలన్న మొబైల్ ఫోన్ పైనే ఆదారపడేంతగా ప్రాదాన్యం సంతరించుకుందని అన్నారు. మొబైల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న /చోరికి గురైతే పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించనవసరం కష్టమేనని అన్నారు. పోయిన ఫోన్ లను వెతికి పెట్టడానికి పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందన్నారు. 
సెల్ ఫోన్ల రికవరీ లో కీలకంగా వ్యవహరించిన ఎస్సై నరేష్, కానిస్టేబుల్ శ్రీను, కోటేశ్వరరావు సిఐ అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .