తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా జీవిత లక్ష్యం 

సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా జీవిత లక్ష్యం 

-అభివృద్ధి అంటే పేదవాడు ఆత్మగౌరవంతో నిలబడగలగడం
 
-తొలి విడతగా 4 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభం
 
-సన్నబియ్యం సరఫరా, రేషన్ కార్డుల పంపిణీతో ప్రజల కష్టాలకు ఉపశమనం
 
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం
 
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
 
ప్రజల సమస్యలను పరిష్కరించడం, రాష్ట్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేయడం తనకున్న ఏకైక ఆశయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే ఒక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
 
హైదరాబాద్‌లోని టీజీ జెన్కో ఆడిటోరియంలో వాక్కులమ్మ ప్రచురణ నుంచి వెలువడిన ‘హసిత బాష్పాలు’ (కావ్యరూపం) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత శ్రీరామ్, ప్రజా కవి అందెశ్రీని అభినందించారు.
 
ముఖ్యమంత్రి మాట్లాడుతూ..
“సాధారణ వ్యవసాయ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను, 4 కోట్ల ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమే నా ధ్యేయం. ఎవరు నచ్చలేదని అధికారాన్ని వినియోగించడం మూర్ఖత్వం. నేను ఎవరినీ శత్రువుగా చూడను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. 2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా, 2007లో ఎమ్మెల్సీగా, 2009లో ఎమ్మెల్యేగా, 2014లో ఎంపీగా, 2023లో సీఎం అయ్యే వరకూ ప్రజలు నాకు పదవులను అప్పగించారు. మంత్రి పదవి చేపట్టకుండానే సీఎం అయ్యానంటే, అది భగవంతుడి నిర్ణయం, ప్రజల విశ్వాసం” అని తెలిపారు.
 
అంబేద్కర్ భావజాలాన్ని గుర్తుచేసుకుంటూ, “అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పేదవాడు సొంతింటి కల నిజం చేసుకున్నప్పుడే ఆత్మగౌరవంతో నిలబడగలుగుతాడు. అందుకోసమే తొలి విడతగా 4 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. రేషన్ కార్డులు రాక బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఇప్పుడు కార్డులు ఇస్తోంది. పేదవాడి ఆత్మగౌరవమే మా ప్రాధాన్యం” అని చెప్పారు.
 
కవుల ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. “అంజన్న, దాశరధి కృష్ణమాచార్య, కాళోజీ, అందెశ్రీ, గద్దర్, గోరటి వెంకన్న వంటి మహనీయులు సమాజానికి చైతన్యం నింపారు. ఉద్యమకారులెవరూ తమను తాము ఉద్యమకారులమని చెప్పుకోరు. నిజమైన ఉద్యమకారులు ఆస్తులు, అంతస్తులు కోల్పోయినా ప్రజలకు ప్రేరణనిచ్చారు. అందెశ్రీ, గద్దర్ లాంటి వారు ఎలాంటి స్వప్రయోజనం లేకుండా నడిచారు” అని ముఖ్యమంత్రి అన్నారు.దేశ స్వాతంత్ర్యం వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, అందుకోసం నిరంతరం శ్రమిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రిన్సిపల్ IMG-20250816-WA0081సెక్రటరీ శ్రీనివాస రాజు, రచయిత శ్రీరామ్, ప్రజా కవి అందెశ్రీ, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, రామకృష్ణానందతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .