గట్ల ఖానాపూర్ మాజీ ఎంపిటిసి శివశంకర్ తల్లి నాగమ్మ మృతి

నాగమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జెడ్పిటిసి, సర్పంచ్‌లు

గట్ల ఖానాపూర్ మాజీ ఎంపిటిసి శివశంకర్ తల్లి నాగమ్మ మృతి

పెద్దమందడి,నవంబర్25(తెలంగాణ ముచ్చట్లు): 

పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ మాజీ ఎంపిటిసి నడిమింటి శివశంకర్ తల్లి నాగమ్మ అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. మృతి వార్త తెలుసుకున్న మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి  నాయకులతో కలిసి మంగళవారం నాగమ్మ పార్థివ దేహానికి  నివాళులు అర్పించారు.నాయకులు శివశంకర్ మరియు కుటుంబ సభ్యులను ఓదార్చి, నాగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి వెంకటస్వామి, వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,అమ్మపల్లె వెంకటేశ్వర రెడ్డి, వెల్టూర్ మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, మద్దూరు వెంకటయ్య, వెంకటేష్, సతీష్, రాములు, అడ్వకేట్ వినోద్ కుమార్, కొండన్న, కావాలి రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .