నాగారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు

నాగారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు

నాగారం, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

నాగారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎన్‌ఎం‌డబ్ల్యుఈయూ–సీఐటీయూ) నూతన కమిటీ ఎన్నికలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విస్తృతస్థాయి సమావేశం మరియు మొదటి మహాసభను గోధుమకుంట శివాలయం వద్ద నిర్వహించారు.సీఐటీయూ కీసర మండల నాయకులు బంగారు నర్సింగరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ – మున్సిపల్ కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, కనీస వేతనం రూ.26,000 నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరినీ పర్మినెంట్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు ఉన్నతాధికారుల వేధింపులు అరికట్టాలని, కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేసి హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిహెచ్. అశోక్, దమ్మైగూడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఉపాధ్యక్షులు ముక్కెర కృష్ణ, కోశాధికారి మోత్కుపల్లి రాములమ్మతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.నూతన కమిటీ:
అధ్యక్షుడు: బంగారు నర్సింగరావు,

WhatsApp Image 2025-09-22 at 7.38.59 PMఉపాధ్యక్షులు: బి. శ్రీను, జాన్ మోషా, ఎమ్. భాగ్యమ్మ,ప్రధాన కార్యదర్శి: కట్ట జంగయ్య,సహాయ కార్యదర్శులు: సిహెచ్. ఐలయ్య, ఎమ్. అశ్విని, ఎన్.స్వామి,
కోశాధికారి: పి. లలిత,సంయుక్త కార్యదర్శులు: ఎమ్. శ్రీకాంత్, కే. నీరజ, జి. శివ,కమిటీ సభ్యులు: పోశయ్య, బిక్షపతి, సిహెచ్. సురేష్, గ్యార మైసయ్య, పుష్పలత, పెంటమ్మ, బొల్లి అరుణ, లక్ష్మీ నరసింహ, ఎమ్. మన్నెమ్మ, మహంకాళమ్మ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .